AP: గుంటూరు జిల్లా తెనాలిలో కూతురు తన వద్దకు రావడం లేదనే కోపంతో అల్లుడిని కిడ్నాప్ చేసి హత్య చేయాలని పథకం వేసిన అత్త విజయలక్ష్మి ఆమెకు సహకరించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లుడు మణికంఠను రాత్రి కారులో బలవంతంగా ఎక్కించుకుని కర్రలతో దాడి చేశారు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు స్పందించి వారిని అడ్డుకున్నారు. అయితే పెళ్లి జరిగినప్పుడు నుండి అత్త ప్రవర్తన నచ్చకే భార్యను పంపడం లేదు. అలాగే పుట్టింటికి దూరం ఉండాలని భార్యతో చెప్పాడు.