
ప్రియురాలితో కలిసి భార్యకు అడ్డంగా దొరికిన భర్త (వీడియో)
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో గురువారం ఒక భార్య తన భర్తను ప్రియురాలితో కలిసి రోడ్డుపై తిరుగుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. దీంతో భార్య, ప్రియురాలు నడిరోడ్డుపై జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు పెరిగిపోతున్నాయని, వైవాహిక బంధాలు బలహీనపడుతున్నాయని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




