భర్త ఎఫైర్.. ఇద్దరు పిల్లలను చంపిన తల్లి!

22679చూసినవారు
భర్త ఎఫైర్.. ఇద్దరు పిల్లలను చంపిన తల్లి!
మహబూబాబాద్‌‌(D) కేసముద్రం(M) నారాయణపురం గ్రామంలో ఇద్దరు చిన్నారుల మృతి మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇద్దరు చిన్నారులను తల్లే హత్య చేసినట్లు నిర్ధారించారు. పందుల ఉపేందర్, శిరీష దంపతులకు ముగ్గురు కుమారులు. తన భర్త మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడని, పిల్లలను తన దగ్గరికి రానివ్వడంలేదనే కారణంతో శిరీష ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అంతకు ముందే తన పిల్లలను చంపాలని ప్లాన్‌‌ చేసింది. ఇందులో భాగంగా జనవరి 15న చిన్న కుమారుడు నిహాల్‌‌ను, ఈ నెల 24న పెద్ద కొడుకు మనీశ్‌‌ను హత్య చేసింది.