ప్రియుడి కోసం కన్న కొడుకుని హతమార్చిన తల్లి

0చూసినవారు
ప్రియుడి కోసం కన్న కొడుకుని హతమార్చిన తల్లి
యూపీలోని కాన్పూర్ దేహాత్ లో దారుణ ఘటన జరిగింది. ప్రియుడి కోసం కొడుకు హత్యకు పాల్పడింది ఓ కసాయి తల్లి. అంగర్ పూర్ నివాసి అయిన మమతా సింగ్ భర్త చనిపోయిన తర్వాత, ఆమెకు మయాంక్ తో సాన్నిహిత్యం పెరిగింది. వీరి బంధాన్ని కొడుకు ప్రదీప్(25) వ్యతిరేకించాడు. దీంతో కొడుకుని అడ్డుతోలగించాలని ప్రియుడు, అతని సోదరుడితో కలిసి ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ప్రదీప్ ను భోజనానికి పిలిచింది. తిరిగి వెళ్తుండగా మయాంక్, రిషి అనే వ్యక్తులు ప్రదీప్ పై సుత్తితో దాడి చేసి చంపేశారు.

సంబంధిత పోస్ట్