ప్రియుడితో కలిసి కొడుకును చంపిన తల్లి

0చూసినవారు
ప్రియుడితో కలిసి కొడుకును చంపిన తల్లి
తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి కన్నకొడుకునే హత్య చేసింది ఓ తల్లి. మహారాష్ట్రలోని పూణే జిల్లా ఖేడ్‌ ప్రాంతంలో నివసిస్తున్న 27 ఏళ్ల బసిరన్‌ పదేళ్ల కిందట భర్తతో విడిపోయింది. వీరికి ముగ్గురు పిల్లలుండగా ఇద్దరు తండ్రితో, ఆరేళ్ల కుమారుడు అవేజ్ తల్లితో ఉంటున్నాడు. ఈ క్రమంలో భర్త స్నేహితుడు రామ్ వినాయక్‌తో బసిరన్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే కుమారుడు తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి తలను బకెట్‌ నీటిలో ముంచి చంపారు. అనంతరం గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులకు చెప్పింది. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్