బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. లేకలేక పుట్టిన కవల పిల్లలను కన్న తల్లే నీళ్ల బకెట్‌లో ముంచి చంపింది. దొడ్డబళ్లాపురం పరిధిలోని తలఘట్టపురకు చెందిన ఉమాదేవి (42), రామలింగప్ప (50) దంపతులు. రామలింగప్ప వ్యాపారం చేస్తుంటారు. ఈ దంపతులకు మే 5న ఒక కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. అయితే పిల్లలు పుట్టాక ఉమాదేవి మానసిక అనారోగ్యానికి గురైంది. పిల్లలను పోషించడంలో కూడా తీవ్ర ఇబ్బందులు పడసాగింది. ఈ నేపథ్యంలో మంగళవారం పిల్లలను బకెట్‌లో ముంచి ప్రాణాలు తీసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.