TG: మెదక్ జిల్లా శివంపేట మండలం శభాష్‌పల్లిలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన తల్లి బొట్టు మమత తన రెండేళ్ల కూతురు తనుశ్రీని హత్య చేసింది. మమత మే 21న తన కూతురుతో కలిసి షేక్ ఫయాజ్‌తో వెళ్లిపోయింది. అయితే మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం వీరిని గుంటూరులో అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో చిన్నారి కనిపించకపోవడంతో పోలీసులు విచారించగా.. తమ సంబంధానికి అడ్డుగా ఉందని కూతురిని గ్రామ శివారులో హత్య చేసి పాతిపెట్టినట్లు ఒప్పుకున్నారు.