వృక్షమాత పద్మశ్రీ తిమ్మక్క కన్నుమూత

52చూసినవారు
వృక్షమాత పద్మశ్రీ తిమ్మక్క కన్నుమూత
ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క (114) బెంగళూరులో అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1911, జూన్‌ 30న జన్మించిన తిమ్మక్క, కర్ణాటక గ్రామీణ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడంలో విశేష కృషి చేశారు. మొక్కల్నే పిల్లలుగా భావించి పచ్చదనం కోసం ఆమె చేసిన సేవలకు గాను 2019లో పద్మశ్రీ అవార్డుతో పాటు బీబీసీ 100 మంది ప్రభావశీల మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆమె మరణవార్తతో పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్