మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన రమాబాయి రన్వీర్ అనే మహిళ.. తన భర్త మరణించినా ధైర్యంగా ఇళ్లలో వంటపనులు చేస్తూ ఇద్దరు కూతుళ్లను చదివిస్తోంది. వారి స్కూల్ ఫీజు చెల్లించడం కోసం స్థానికంగా నిర్వహించిన మారథాన్‌లో ఆమె చెప్పులు లేకుండా, చీరకట్టుతోనే పరిగెత్తి రూ.3,000 నగదు బహుమతి గెలుచుకున్నారు. తల్లి ప్రేమ, పిల్లల చదువు కోసం ఆమె పడిన తపన అందరినీ కంటతడి పెట్టించింది.