బిడ్డకు జన్మనిచ్చి తల్లి మరణం.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

2చూసినవారు
బిడ్డకు జన్మనివ్వటం ఆడవారికి పునర్జన్మలాంటిది. బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో కొందరు తల్లులు ప్రాణాలు సైతం పోగొట్టుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. ఓ తల్లి తన బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు కోల్పోయిందని పేర్కొంటూ 'షలాహు' అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో నవంబర్ 6వ తేదీన ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో మహిళ బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు కోల్పోయింది. కళ్లు కూడా తెరవని ఆ బిడ్డను డాక్టర్లు తల్లి ముఖంపై పెట్టారు. ఈ క్రమంలో ఆ పసిబిడ్డ గుక్కపట్టి ఏడవడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్