రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి

27చూసినవారు
రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి
AP: అనంతపురం జిల్లా యాడికి మండలం వేములపాడులో విషాదం చోటు చేసుకుంది. వేములపాడులో రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారు. యాడికి మండలం రాయలచెరువు-వేములపాడు గ్రామాల రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. తల్లి, ఓ కుమార్తె స్పాట్‌లోనే మృతి చెందగా.. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని రాయలచెరువు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలిస్తుండగా ఆ చిన్నారి కూడా మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్