విషం తాగిన తల్లి.. ప్రాణాలు కాపాడిన కూతురు

24098చూసినవారు
విషం తాగిన తల్లి.. ప్రాణాలు కాపాడిన కూతురు
విషం తాగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన తల్లి ప్రాణాలను ఐదేళ్ల కూతురు కాపాడుకుంది. ఈ ఘటన యూపీలోని మీర్జాపూర్ లో శనివారం చోటు చేసుకుంది. తన తల్లి విషం తాగిన విషయం తెలుసుకున్న బాలిక శివాణి ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ 1090కు కాల్ చేసింది. ఈ విషయం తెలియాగానే సమీపంలోని పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. సరైన సమయంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించిన బాలికపై ప్రశంసలు కురుస్తున్నాయి.

సంబంధిత పోస్ట్