
యూరప్‌కు భారత్ డీజిల్ సరఫరా కీలకం
రష్యా ఎగుమతులు తగ్గడం, అమెరికా సరఫరాలు నెమ్మదించడంతో యూరప్‌కు డీజిల్ అందించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. వోర్టెక్సా రిపోర్ట్ ప్రకారం.. ఆగస్టులో బాబ్-ఎల్-మండేబ్ మార్గం గుండా రోజుకి 2 లక్షల బ్యారెళ్ల డీజిల్ యూరప్‌కు చేరింది, ఇది మొత్తం దిగుమతుల్లో 60%. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రిఫైనర్‌గా ఉన్న భారత్, దేశీయ అవసరాలకు మించి ఉత్పత్తి చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల వల్ల రష్యా రిఫైనరీలు దెబ్బతినడంతో సరఫరా తగ్గింది. శీతాకాలంలో యూరప్‌లో డీజిల్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.




