కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు పని అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ,
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలు, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీఆర్ఎస్ మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
బీజేపీ కూడా 2014 నుంచి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ రెండు పార్టీల విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.