AP: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, బీసీ జేఏసీ రాజకీయ నాయకత్వంలో ఉండకూడదని, నిక్కచ్చిగా నడిపేవారు నాయకత్వం వహించాలని సూచించారు. అయితే, ఉద్యమం విజయవంతం కావడానికి రాజకీయ పార్టీల ప్రమేయం తప్పనిసరి అని ఆయన అన్నారు. అందుకే అన్ని పార్టీలను భాగస్వాములను చేసి బీసీ జేఏసీ అందరిదిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.