
ఇంటి నిర్మాణ అనుమతులకు ఫీజు రూ.1 మాత్రమే: టీడీపీ
AP: పుర, నగర పాలక సంస్థలు, నగర పంచాయతీల్లోని పేద, మధ్య తరగతి కుటుంబాల కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని టీడీపీ తెలిపింది. సొంత ఇంటి కల సాకారానికి కూటమి ప్రభుత్వం మరో వరం ఇచ్చిందని పేర్కొంది. 50 గజాలలోపు చేపట్టే జీ+1 ఇంటి నిర్మాణ అనుమతుల ఫీజు రూ.1 మాత్రమేనని వెల్లడించింది. దీని ద్వారా ఆయా వర్గాలకు ఏటా రూ.6 కోట్ల ఫీజుల భారం తప్పనుందని పేర్కొంది. కాగా, రాష్ట్రంలో ఉన్న 123 పట్టణ, స్థానిక సంస్థల్లో ఈ సౌలభ్యం అమలు కానుంది.




