పెంపుడు కుక్కతో పార్లమెంటుకు వెళ్లిన ఎంపీ రేణుక

65చూసినవారు
పెంపుడు కుక్కతో పార్లమెంటుకు వెళ్లిన ఎంపీ రేణుక
పార్లమెంట్ సమావేశాల వేళ కాంగ్రెస్ MP రేణుకా చౌదరి ఇవాళ తన పెంపుడు కుక్కతో వెళ్లడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. కుక్కను లోపలికి తీసుకెళ్లాడానికి అనుమతి లేకపోవడంతో తన సిబ్బందితో వెనక్కి పంపారు. దీనిపై మీడియా ప్రశ్నించగా 'అది చాలా చిన్నది. ఎవరినీ కరవదు. కరిచే వారు కొందరు సభ లోపల ఉన్నారు' అని NDAపై సెటైర్లు వేశారు. కాగా ఆమె వైఖరిని BJP MP జగదాంబికా పాల్ తప్పుబట్టారు. 'పెంపుడు జంతువుల ఎంట్రీపై ఎవరికీ ప్రత్యేక అనుమతులు లేవు' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్