తెలంగాణలో MPTC, ZPTC ఎన్నికలు.. ఎప్పుడంటే?

TG: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం ఆశావహులకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మే, జూన్ నెలల్లో జనగణన ప్రక్రియ చేపట్టనున్నారు. అలాగే మే 1 - 31 వరకు రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. జనగణన సర్వేతో పాటు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ జూలై నెలాఖరుకు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలల్లో MPTC, ZPTC ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టేలా కనిపిస్తోంది.
