చెన్నై సూపర్ కింగ్స్ కోచ్‌గా ఎంఎస్ ధోనీ!

9చూసినవారు
చెన్నై సూపర్ కింగ్స్ కోచ్‌గా ఎంఎస్ ధోనీ!
మోకాలి గాయం కారణంగా ధోనీ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆడలేకపోయిన నేపథ్యంలో, ఆయన కెరీర్ ముగిసిపోయిందనే చర్చలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో CSK జట్టు సీఈవో మాట్లాడుతూ, ధోనీ జట్టులో ఏ పాత్రలో కొనసాగాలనుకున్నా తమకు అభ్యంతరం లేదని, అది పూర్తిగా అతని వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ధోనీ CSK లోనే శాశ్వతంగా కొనసాగాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆటగాడిగా, కోచ్‌గా లేదా మెంటార్‌గా ఏ పాత్రలో ఉన్నా తమకు ఆనందమేనని, CSK కు సంబంధించిన ఏ నిర్ణయమైనా ధోనీ అభిప్రాయంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన వెల్లడించారు.