
విజయవాడ దుర్గగుడిలో వీఐపీ దర్శనాలు రద్దు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, రేపు ఎలాంటి వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రొటోకాల్ దర్శనాలు ఉండవని ఈవో శీనా నాయక్ ప్రకటించారు. అన్ని క్యూలైన్లు ఉచితమేనని, ప్రతి భక్తునికి ఉచితంగా 20 గ్రాముల లడ్డూ ప్రసాదం అందజేస్తామని తెలిపారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ దుర్గగుడికి భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఇప్పటివరకు 11,28,923 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.




