
విమానం రద్దయితే రీఫండ్ పొందండిలా!
ఇటీవలి నిర్వహణపరమైన లోపాల వల్ల ఇండిగో అనేక విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీనిపై ఎయిర్‌లైన్ క్షమాపణలు చెబుతూ, డిసెంబర్ 5 నుంచి 15 మధ్య బుక్ చేసుకున్న వారికి పూర్తి రీఫండ్ ఇస్తామని ప్రకటించింది. విమానం రద్దయినా లేదా ఆలస్యమైనా ప్రయాణికులు పూర్తి రీఫండ్ పొందే హక్కు ఉందని, డీజీసీఏ నిబంధనల ప్రకారం అసాధారణ పరిస్థితుల్లో నాన్-రిఫండబుల్ టికెట్లకు కూడా రీఫండ్ తప్పనిసరి అని తెలిపింది.




