చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి తర్వాత, సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్, హార్దిక్ పాండ్యా మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్‌ల్లో 7 ఓడిపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఈ నేపథ్యంలో, ప్రత్యర్థి జట్టు సీఈఓతో హార్దిక్ చర్చలు జరపడం వైరల్‌గా మారింది. గతంలో సంజూ శామ్సన్ కూడా ఇలాగే కాశీ విశ్వనాథన్‌తో మాట్లాడి సీఎస్‌కేలోకి వెళ్లిన సంఘటనతో ముడిపెట్టి, ట్రేడింగ్ రూమర్లకు ఊతమిచ్చింది.