ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్?

8చూసినవారు
ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్?
TG: రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కసరత్తు చేస్తున్నాయి. ఈసీ జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది. 10న తుది జాబితా వెలువరించనుంది. దీంతో 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సంక్రాంతి పండగ, సెలవుల కారణంగా కుదరకపోతే 20 లోపు విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనికి అనుగుణంగా, మిగతా ప్రక్రియ సజావుగా సాగేలా పురపాలక పట్టణాభివృద్దిశాఖ సిద్ధమవుతోంది.

సంబంధిత పోస్ట్