TG: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు ఫ్యూహాలు రచిస్తున్నాయి. అయితే మెజార్టీ మున్సిపాల్టీల్లో విజయం సాధిస్తామని బీఆర్ఎస్ నేతలు పైకీ చెప్తోన్న వాస్తవానికి మాత్రం 5నుంచి 10 మున్సిపాల్టీల్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా సీట్ల కంటే ఓటింగ్ శాతం పెంచుకోవడంపై ఆ పార్టీ నేతలు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనితో రాష్ట్రంలో తామే ప్రత్యామ్నయ పార్టీ అనే సందేశం ప్రజల్లోకి వెళ్తుందని అంచనా వేస్తున్నారట. అయితే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు నియోజకవర్గాల్లోని అన్ని మున్సిపాల్టీల్లో విజయం సాధించడంపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది.