TG: మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ పర్యటన ఖరారైంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం తిరిగి రాగానే జిల్లాల బాటపట్టనున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 3న నల్గొండ జిల్లా మిర్యాలగూడ, 4న కరీంనగర్ జిల్లా జగిత్యాల, 5న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్ లో సీఎం రేవంత్ పర్యటించనున్నట్లు సమాచారం.