తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల జోష్.. తొలి రోజు 902 నామినేషన్లు దాఖలు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. నామినేషన్ల స్వీకరణ జోరుగా కొనసాగుతోంది. తొలి రోజే మొత్తం 902 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా 382 నామినేషన్లు నమోదు కావడం విశేషం. శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా, రాజకీయ పార్టీల్లో పోటీ ఉత్కంఠగా మారింది.