మున్సిపల్ ఎన్నికలు.. బీజేపీ యాక్షన్ ప్లాన్ ఇదేనా?

16చూసినవారు
మున్సిపల్ ఎన్నికలు.. బీజేపీ యాక్షన్ ప్లాన్ ఇదేనా?
TG: మున్సిపల్ ఎన్నికల సమరానికి అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సిద్ధం అవుతున్నాయి. సరైన ప్రణాళికతో కార్యాచరణను రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, నితిన్‌ నబిన్‌ రానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో MBNRలో నితిన్‌ నబిన్‌ సభ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే 8, 9 తేదీల్లో నిర్మల్‌ లో అమిత్‌ షా సభ ఉండే అవకాశం ఉంది. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.

సంబంధిత పోస్ట్