మున్సిపల్ ఎన్నికలు.. నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు

4చూసినవారు
మున్సిపల్ ఎన్నికలు.. నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు
TG: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. రెండో రోజు 7,980 మంది అభ్యర్థుల నుంచి 8,326 నామినేషన్లు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. ఇందులో కాంగ్రెస్ నుంచి 3,379, బీఆర్ఎస్- 2,506, బీజేపీ- 1,709, బీఎస్పీ- 142, సీపీఐ(M)- 88, ఎంఐఎం- 166, ఆప్- 17, టీడీపీ నుంచి 10 నామినేషన్లు దాఖలైనట్లు పేర్కొంది. దీంతో మొత్తంగా నామినేషన్ల సంఖ్య 9,276కి చేరింది. నేడు చివరి రోజు కావడంతో ఎక్కువ మొత్తంలో దాఖలయ్యే ఛాన్స్ ఉంది.

సంబంధిత పోస్ట్