మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు 'రెబల్స్' బెడద!

16చూసినవారు
మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు 'రెబల్స్' బెడద!
TG: మున్సిపల్ ఎన్నికలకు నిన్నటితో నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. పలు మున్సిపాలిటీల్లో అత్యధిక శాతం వార్డులకు కాంగ్రెస్‌ పేరుతో రెండు నుంచి ఐదుగురి వరకూ నామినేషన్లు వేశారు. వీరిలో కొందరు ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పుకొమని భీష్మిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి చాలా మున్సిపాలిటీల్లో కనిపిస్తోందని.. వాటిలో కొన్నిచోట్ల అందరినీ ఉపసంహరింపజేయడం సులువు కాకపోవచ్చని సీనియర్‌ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి నిజంగా ప్రజల్లో బలముందనే కోణంలో కాంగ్రెస్‌ అంతర్గతంగా సర్వేలు చేయిస్తోంది. ప్రతి మున్సిపాలిటీలో ఒక్కో వార్డు వారీగా అభిప్రాయాలను సేకరిస్తోంది.

సంబంధిత పోస్ట్