
భారత్ ట్యాక్సీని ప్రారంభించిన అమిత్ షా
కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా 'భారత్ ట్యాక్సీ' సేవలను ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో ఈ సేవలను తాజాగా లాంచ్ చేశారు. తొలుత దిల్లీ-ఎన్సీఆర్, గుజరాత్లో అందుబాటులోకి రానున్న ఈ సేవలు, అనంతరం దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించనున్నాయి. 'కశ్మీర్ నుంచి కన్యాకుమారి, ద్వారక నుంచి కామాఖ్య వరకు మూడేళ్లలో ఈ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి' అని అమిత్ షా వెల్లడించారు. ఈ సేవలతో వచ్చిన లాభాలను డ్రైవర్లతో పంచుకుంటామని ఆయన తెలిపారు.




