ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ప్రియుడి భార్య, కుమారుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన మహిళ
Feb 01, 2026, 01:02 IST/

ప్రియుడి భార్య, కుమారుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన మహిళ

Feb 01, 2026, 01:02 IST
TG: ప్రియుడి భార్య, ఆమె బిడ్డ(6 నెలల పసికందు)పై ఓ మహిళ పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. ఈ దారుణ ఘటన నల్గొండ(D) నాంపల్లి(M) కేతెపల్లిలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన కుందేళ్ల నగేశ్, మమత(25)కు 2019లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. కొన్నేళ్లుగా నగేశ్‌కు అదే గ్రామానికి చెందిన సుజాత(40)తో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో నగేశ్‌ భార్యను అడ్డు తొలగించుకోవాలనుకున్న సుజాత శనివారం మమత తన చిన్న కుమారుడు అద్విక్‌‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. మంటల్లో మమత అక్కడే చనిపోగా.. కొడుకు అద్విక్‌కు చికిత్స పొందుతూ మృతి చెందాడు.