రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో.. సిరిసిల్ల పట్టణంలోని మానేరు వంతెన వద్ద ఎస్.ఎస్.టి చెక్ పోస్ట్‌లో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పురుమండ్ల వెంకట్ రెడ్డికి చెందిన వాహనంలో అనుమానాస్పదంగా రూ. 4 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం విచారణ జరుగుతోందని పట్టణ సీఐ కృష్ణ తెలిపారు. ఎన్నికల నిబంధనలు, చట్టపరమైన విధానాల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు.