TG: నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో ఒక ట్రాన్స్ జెండర్ నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు (శివనేనిగూడెం) నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ నాగిళ్ల కావేరి (సుధాకర్) శుక్రవారం తన నామినేషన్ పత్రాలను మున్సిపాలిటీ నామినేషన్ దాఖలు కేంద్రంలో అధికారులకు సమర్పించింది. నామినేషన్ చివరి రోజు కావడంతో ఆమె తన నామినేషన్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేసింది.