TG: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జూనియర్ అసిస్టెంట్ పల్దా అశోక్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి కలకుంట్ల కిరణ్ కుమార్ రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి తల్లి నెలవారీ పెన్షన్ మంజూరు కోసం ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్స్ సిద్ధం చేయడం, సర్వీస్ బుక్‌లో అవసరమైన వివరాలు నమోదు చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. ఇద్దరినీ అరెస్ట్ చేసి హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపింది.