విశాఖలో యువకుడి హత్య.. కేసులో కనిపించని పురోగతి

19చూసినవారు
విశాఖలో యువకుడి హత్య.. కేసులో కనిపించని పురోగతి
AP: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలో ఈ నెల 7న జరిగిన మైలపల్లి చంటి హత్య కేసులో మూడు వారాలు గడిచినా పోలీసుల దర్యాప్తులో పురోగతి కనిపించలేదు. తల, మెడపై తీవ్ర గాయాలతో చంటి మృతదేహం లభ్యమైంది. హత్యకు ముందు తనకు ప్రాణభయం ఉందని చంటి తన సోదరికి చెప్పినట్లు సమాచారం. కేసు మిస్టరీని ఛేదించేందుకు వన్‌టౌన్‌ పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేసినా ఫలితం దక్కలేదు. దాంతో ఆరుగురు సభ్యులతో సిట్‌ ఏర్పాటు చేశారు. 80 మందికిపైగా విచారించినా నిందితులపై స్పష్టమైన ఆధారాలు లభించలేదని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్