
నాగార్జున బర్త్‌డే స్పెషల్.. ‘కింగ్ 100’ టైటిల్ గ్లింప్స్ అప్డేట్
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్లో వందో మైలురాయిగా నిలుస్తున్న ‘కింగ్ 100’ సినిమాకు సంబంధించిన అప్డేట్ వెలువడింది. యువ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నాగార్జున పుట్టినరోజు కానుకగా ఆగస్టు 29 ఉదయం 9 గంటలకు టైటిల్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ఫాస్టెన్ యువర్ సీట్‌బెల్ట్స్… రేపటి నుంచి కింగ్ ఆధిపత్యం మొదలవ్వబోతోంది’ అనే ప్రకటన అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.




