TG: ఒక ముస్లిం వ్యక్తి, మతం కంటే మానవత్వం గొప్పదని నిరూపిస్తూ, ఇద్దరు హిందూ యువతులకు అండగా నిలిచాడు. తన సొంత ఖర్చులతో వారిద్దరికీ ఘనంగా వివాహం జరిపించి, అత్తారింటికి పంపించాడు. ఈ సహాయానికి కృతజ్ఞతగా, యువతులు అతన్ని ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఆ వ్యక్తి మానవత్వానికి ఆదర్శంగా నిలిచాడని ప్రశంసలు అందుకుంటున్నాడు.