TG: హనుమకొండలోని పెద్దమ్మగడ్డ ప్రాంతానికి చెందిన యువకులు మత సామరస్యాన్ని చాటుతూ, భక్తికి మతాలు అడ్డుగోడలు కావని నిరూపిస్తున్నారు.
క్రికెట్ కోచ్ మహమ్మద్ మోహిన్ ఆధ్వర్యంలోని యూత్ అసోసియేషన్ ముస్లిం, హిందూ సభ్యులు కలిసి సొంత ఖర్చుతో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గత 7 ఏళ్లుగా వరుసగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలను దగ్గరుండి నిర్వహిస్తూ, భక్తికి, భగవంతుడికి మతాలు అడ్డుగోడలు కావని, హిందూ-ముస్లింలు సోదరులనే నినాదాన్ని వీరు నిజం చేస్తున్నారు.