హర్మూజ్ జలసంధి దాటిన భారత ఎల్పీజీ నౌక

6చూసినవారు
హర్మూజ్ జలసంధి దాటిన భారత ఎల్పీజీ నౌక
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, భారత్‌కు రావాల్సిన ఎంవీ సన్‌షైన్ అనే ఎల్పీజీ నౌక హర్మూజ్ జలసంధిని దాటినట్లు వార్తలు వస్తున్నాయి. భారత నౌకాదళం, ఇతర ఏజెన్సీల సహకారంతో ఈ నౌక సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ నుంచి ఈ నౌకతో సహా 15 ఎల్పీజీ నౌకలను తరలించారు. అయితే, నౌకలో ఎంత ఎల్పీజీ ఉంది, ఎప్పుడు చేరుకుంటుందనే వివరాలు తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్