'ప్రియుడు కలలోకి వచ్చి పిలుస్తున్నాడని'.. యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్

6చూసినవారు
'ప్రియుడు కలలోకి వచ్చి పిలుస్తున్నాడని'.. యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్
TG: శంషాబాద్‌ సిద్ధార్థ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్‌కు చెందిన సిద్ధార్థ్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉన్న నర్మద.. ఇటీవల అతడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ప్రియుడు కలలోకి వచ్చి తనను పిలుస్తున్నాడని సోదరితో చెప్పిన ఆమె.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేకే తన కుమార్తె ఈ నిర్ణయం తీసుకుందని నర్మద తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఆర్జీఐఏ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్