వెంకటేశ్ తన ఫేవరెట్ హీరో అని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఓ ఈవెంట్లో తెలిపారు. తాను పెన్ పట్టుకుని డైలాగులు రాసిన తొలి సినిమా వెంకటేశ్దేనని గుర్తుచేసుకున్నారు. వెంకీ అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పారు. అయితే, అదే సమయంలో ఆయనంటే ఎందుకో చాలా భయంగా ఉంటుందని త్రివిక్రమ్ పేర్కొన్నారు.