ప్లాన్ ప్రకారమే తన పీఏను హత్య చేసినట్లు బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. నిందితులు 2-3 రోజులు రెక్కీ నిర్వహించి ఈ హత్య చేసినట్లు డీజీపీ చెప్పారని తెలిపారు. ఇది టీఎంసీ 15 ఏళ్ల ఆటవిక పాలనకు నిదర్శనమని విమర్శించారు. త్వరలో రాష్ట్రాన్ని ప్రక్షాళిస్తామన్నారు. కాగా ఈ హత్య వెనుక మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ హస్తం ఉందని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు.