'మిరాయ్‌'లో నా పాత్ర చాలా పవర్ ఫుల్, ఇది నా కంబ్యాక్ ఫిల్మ్: మంచు మనోజ్

18731చూసినవారు
'మిరాయ్‌'లో నా పాత్ర చాలా పవర్ ఫుల్, ఇది నా కంబ్యాక్ ఫిల్మ్: మంచు మనోజ్
సెప్టెంబర్ 12న విడుదల కానున్న 'మిరాయ్' చిత్రంలో తాను చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశానని రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అన్నారు. సినిమా అద్భుతంగా వచ్చిందని, ఇది తనకు కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్ర విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సినిమా విశేషాలను పంచుకున్నారు.'మిరాయ్' కథ, తన పాత్ర చాలా నచ్చిందని, తేజ సజ్జతో కలిసి నటించడం ఆనందంగా ఉందని మనోజ్ తెలిపారు. శ్రీరాముల వారి నేపథ్యం, తొమ్మిది పుస్తకాల బ్యాక్ డ్రాప్, ఇతిహాసల కోణం చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పారు. ఇందులో తనది 'లేజీగా ఉండేవాడు బ్రతకకూడదనే' పవర్ ఫుల్ పాత్ర అని తెలిపారు. ఈ పాత్ర కోసం దాదాపు 8 నెలలు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకున్నానని వెల్లడించారు.రజనీకాంత్‌కు 'మిరాయ్' ట్రైలర్ చూపించగా ఆయన చాలా మెచ్చుకున్నారని, గ్యాప్ లేకుండా సినిమాలు చేయమని ప్రోత్సహించారని మనోజ్ తెలిపారు.దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని గొప్ప టెక్నీషియన్ అని, హాలీవుడ్ స్థాయిలో సినిమా తీశారని కొనియాడారు. అలాగే నిర్మాత విశ్వ ప్రసాద్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను గ్రాండ్ స్కేల్లో నిర్మించారని అభినందించారు.ప్రస్తుతం 'డేవిడ్ రెడ్డి', 'రక్షక్' సినిమాల్లో నటిస్తున్నానని, అవి కూడా హై ఇంటెన్సిటీ యాక్షన్ సినిమాలు అని మనోజ్ చెప్పారు. 'అహం బ్రహ్మాస్మి', 'వాట్ ది ఫిష్' సినిమాలు కూడా సరైన సమయంలో వస్తాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్