
బలోచిస్థాన్ హోంమంత్రి కాన్వాయ్‌పై దాడి.. ఇద్దరు మృతి
పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ హోంమంత్రి మీర్ జియావుల్లా కాన్వాయ్‌పై శుక్రవారం దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు. హోంమంత్రి సురక్షితంగా బయటపడ్డారు. పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున కలత్ నుంచి క్వెట్టాకు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడులకు బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




