AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రంజిత అనే బాలిక అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు మిస్టరీ వీడింది. ఇంటి ఓనర్ జకీర్ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. జకీర్‌పై గతంలో రెండు హత్య కేసులున్నాయి. 2002లో ఓ మహిళపై హత్యాచారం చేశాడు. ఇటీవల జైలు నుంచి విడుదలై ఇంట్లో ఉంటున్నాడు. రంజిత ఫ్యామిలీ రెండో ఫ్లోర్‌లో అద్దెకు ఉంటోంది. జకీర్ బాలికను హత్య చేయడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.