టెహ్రాన్ ఆకాశంలో మిస్టరీ.. 50 ఏళ్ల తర్వాత మళ్లీ కలకలం

9285చూసినవారు
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఆకాశంలో సెప్టెంబర్ 20న ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల లైట్లతో తక్కువ ఎత్తులో ఎగురుతున్న ఓ మిస్టరీ వస్తువు కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది డ్రోనా లేక మరేదైనా వస్తువా అనే దానిపై అధికారిక స్పష్టత లేదు. 1976లో ఇదే నగరంలో కనిపించిన యూఎఫ్‌వో ఘటనకు 50 ఏళ్ల తర్వాత ఈ సంఘటన జరగడం గమనార్హం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఈ వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

సంబంధిత పోస్ట్