
మహిళ కిడ్నాప్.. వివస్త్రను చేసి కొట్టారు (వీడియో)
AP: ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. క్యాటరింగ్ చేసుకునే మహిళల మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో లక్ష్మి చౌదరి అనే మహిళను ఇద్దరు మహిళలు, నలుగురు యువకులు కిడ్నాప్ చేశారు. ఆమెను వివస్త్రను చేసి.. ఓ గదిలో బంధించి దారుణంగా కొట్టారు. ఆ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఓ ఫ్రెండ్ సాయంతో తప్పించుకున్న బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




