నాగార్జన సాగర్ బ్యాక్ వాటర్ నీళ్లు రంగు మారడంతో కలకలం రేగుతోంది. కెమికల్స్ కలిసిన ఆనవాళ్లు కనిపిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గాఢమైన ఆకుపచ్చ రంగులోకి నీరు మారడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు నీటి శాంపిళ్లను సేకరించారు. శాంపిళ్లను ల్యాబ్‌కు పంపిస్తామని అధికారులు తెలిపారు. రిపోర్టు వచ్చిన తర్వాత నీటి రంగు మారడానికి గల కారణం తెలుస్తుందని పేర్కొన్నారు.