నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయం 14 గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1,63,009 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం ప్రజెక్టు నీటిమట్టం 588.4 అడుగులు ఉంది. నీటి నిల్వ 307.28 టీఎంసీలుగా ఉంది. నాగార్జునసాగర్ కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.