
నాగర్ కర్నూల్: ఒకే చోట ఏకంగా 12 పాములు కలకలం
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం, గుడ్లనర్వ గ్రామంలోని మేకల శివుడు ఇంటి దగ్గర ఒకే చోట ఏకంగా 12 పాములు దర్శనమిచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న ఇంటి యజమాని శివుడు అదే గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ జగన్ కి సమాచారం ఇచ్చాడు. దీంతో జగన్ అక్కడికి చేరుకొని 12 పాములను పట్టుకొని అడవి ప్రాతంలో వదిలేసినట్టు తెలిపారు. చుట్టుపక్కల ఏ గ్రామంలోనైనా పాములు కనబడితే అట్టి పాములను చంపకుండా తమకు సమాచారం ఇస్తే వెంటనే అక్కడికి చేరుకొని పట్టుకుంటామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.







































